నేడు కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ రెండవ వారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని, రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాదిలా ఈసారి విపత్కర పరిస్థితులు ఉండకపోవచ్చునని హైదరాబాద్ వాతావరణ అధికారి నాగరత్నం అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేరళలో నైరుతి గాలులు బలపడ్డాయని, దీంతో కేరళ ప్రాంతాలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో జూన్ రెండో వారంలో వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా… వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజులు ఆలస్యంగా వస్తున్నాయన్నారు.