బొడ్లపాడు ప్రాధమిక ఉన్నత పాఠశాలలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

పాలకొండ, బొడ్లపాడు ప్రాధమిక ఉన్నత పాఠశాలలో మానవతామూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా, బొడ్లపాడు స్కూల్ ఆవరణలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మదర్ థెరిస్సా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జనసేన జానీ మాట్లాడుతూ… మదర్ థెరిస్సా చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ప్రజలు అనేకమైన కుష్టురోగులతో జీవిస్తూ ఉంటే సొంత కుటుంబ వ్యక్తులు కూడా ముట్టుకోలేని పరిస్థితులలో… నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆ వ్యక్తులకు ఆమె చేసిన సేవా కార్యక్రమాలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన విషయం. భారతదేశంలో ఎంతమంది ఉన్న అలాంటి మాతృమూర్తిలా ప్రజలకు సేవ చేయడం చాలా కష్టమని అంతటి గొప్ప మంచివారు మదర్ థెరిస్సా అని గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వారాడ రాంబాబు మాస్టర్, బోనంగి వాసుదేవరావు మాస్టర్, ఏ యన్ యమ్ కళావతి, యమ్ యల్ హెచ్ పి పల్లవి స్కూల్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.