సేవలో మదర్ థెరిస్సా మాకు స్ఫూర్తి

  • ఆమె స్ఫూర్తితోనే రవి చారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది
  • రవి కుమార్ మిడతాన, రవి ఎడ్యుకేషనల్ మరియు చారిటబుల్ సొసైటీ (ఫౌండర్ ప్రెసిడెంట్ )

మదర్ థెరిస్సా బర్త్ డే సందర్భంగా ఆమెను మరొకసారి గుర్తు చేసుకుంటూ… ఆమె చేసే సేవలు స్ఫూర్తిగా తీసుకొని మన వంతు కూడా సమాజానికి చేయాలని, మదర్ థెరిస్సా పేరు మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎక్కడో వేరేదేశంలో పుట్టి మన భారత దేశానికి విచ్చేసి ఇక్కడ ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకుని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించి, ఆఖరికి తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టి ఒకానొక సమయంలో యాచన కూడా చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. మంచి, మానవత్వం, దయాగుణం, సహాయతత్వం అనేవి ప్రతిఒక్క మనిషి అలవర్చుకోవాలని భగవంతుడు మనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఎంతో కొంత పరులకు సహాయపడడానికే అని చెప్తుంటారు థెరిస్సా. తన జీవితాన్ని సేవకే అంకితం చేసారు. 1943లో ఏర్పడిన కరువు పరిస్థితులు కలకత్తా ప్రజల్లో ఎందరినో మరింత పేదవారిని చేసాయి. ఇక 1946లో కేవలం కాన్వెంట్ లో ఉపాద్యురాలిగానే కాక తనవంతుగా ప్రజలకు సేవ చేయాలనీ తలచి తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి ఎంతో నిరాడంరమైన నీలపు అంచుగల తెల్ల చీరను ధరించి, అనంతరం భారతదేశ పౌరసత్వం స్వీకరించి అక్కడి నుండి మురికివాడల్లోకి ప్రవేశించి పేద వారికి సేవ చేయడం ఆరంభించారు.