బొజ్జాపు షణ్ముఖ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నరసాపురం గ్రామానికి చెందిన జనసైనికుడు బొజ్జాపు సత్యనారాయణ కుమారుడు షణ్ముఖ్ ఆరోగ్యం బాగోలేక రాజమండ్రి సిద్దార్ధ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.