అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు పలువురికి శ్రీమతి బత్తుల పరామర్శ

రాజానగరం నియోజకవర్గం: అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్న రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామస్తులను మంగళవారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించారు. ముందుగా మల్లంపూడి గ్రామానికి చెందిన వెలిసి మణికంఠ అనారోగ్యంతో బాధపడుతూ అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలుసుకుని వారిని శ్రీమతి బత్తుల పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. అనంతరం అదే గ్రామానికి చెందిన సంగుల శ్రీరాములు ఇటీవల పాము కాటుకు గురై అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న శ్రీమతి బత్తుల వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. వీరి వెంట సంగుల తమ్మరావు, సంగుల రమేష్ బాబు, సంగుల దుర్గాప్రసాద్, మేక ప్రదీప్, జి. సతీష్, ఏ. సతీష్, సంగుల చిట్టిదొర, సంగుల సతీష్, కె. మణికంఠ స్వామి, సంగుల గంగబాబు, ఆకుల శ్రీనివాస్, పడాల శ్రీను, పడాల వీరబాబు, ఒక్కపట్ల వీరబాబు, సంగుల శ్రీను, సంగుల నాగేశ్వరావు, సంగుల సుబ్రహ్మణ్యం, పప్పు దుర్గాప్రసాద్, గుబ్బల వీర వెంకట స్వామి, రాయి గంగాధర్, సంగుల శ్రీను, కేశవరపు గణపతి, తంబాబత్తుల శ్రీను, మదిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, దేనిడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), అడ్డాల దొరబాబు, యర్రంశెట్టి పోలారావు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.