జనసైనికుడి కుటుంబానికి అండగా శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, నెల్లిమర్ల మండలంలో సిల్లా సందీప్ అనే జనసైనికుడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రయాణంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి మృతి చెందిన సందీప్ వారి కుటుంబాన్ని ఈ శనివారం పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో మాధవి మాట్లాడుతూ సందీప్ లాంటి జనసైనికుడ్ని పోగొట్టుకోవడం చాలా బాధకరమైన విషయం అని, పార్టీ కోసం తనవంతు ఒక జనసైనికుడిలా అహర్నిశలు కష్టపడ్డారు అని తెలిపారు. మాధవి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారి తండ్రికి ఉద్యోగం, తమ్ముడి చదువు బాధ్యతలు తీసుకుంటామని తెలియజేసి, వారి కుటుంబానికి ఆర్ధికసహాయం అందజేశారు.