బయ్యన వారి నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు నూతనంగా ప్రారంభిస్తున్న శ్రీ మహాలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ మాదాపురం వారి షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బయ్యన సత్యనారాయణ, బయ్యన ఉమామహేశ్వరరావు అండ్ బ్రదర్స్ ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ను బయ్యన సత్యనారాయణ, బయ్యన ఉమామహేశ్వరరావు అండ్ బ్రదర్స్ ఘనంగా సన్మానించడం జరిగింది.