తిరుపతి ఎస్పీని కలిసి.. డి.యస్.పి పై కంప్లైంట్ చేసిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గౌరవ తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసి.. ఆదివారం రేణిగుంట పట్టణంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నపుడు శ్రీమతి వినుత పైన, మరియు భర్త కోటా చంద్రబాబు పైన, నాయకులపైన పోలీసులు అధికార దుర్వినియోగంతో, ముఖ్యంగా డి.యస్.పి దురుసుగా వ్యవహరించి, బలవంతంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి గాయపడేల వ్యవహరించి, అవమానకరంగా మాట్లాడిన దానిపై ఫిర్యాదు చెయ్యడం జరిగింది. మహిళ అని కూడా చూడకుండా ప్రజల కోసం పోరాడితే పోలీసులు వ్యవహరించిన తీరును, 2019 నుండి వినుత, భర్త కోటా చంద్రబాబు పై పెట్టిన 5 అక్రమ కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు, వీడియోలతో వివరించడం జరిగింది. ఎస్పీ దగ్గర న్యాయం కావాలని, లేని యెడల గౌరవ హైకోర్ట్, మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ ను సంప్రదిస్తామని తెలపడం జరిగింది. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ ఆదివారం జరిగిన సంఘటన పై డీ.యస్.పి తీరు, 5 అక్రమ కేసులపై సమగ్రంగా, నిబద్దతతో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రత్యేక అధికారిగా అడిషనల్ ఎస్పీ ని నియమించి 10 రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. తప్పకుండా న్యాయం చేస్తానని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడం జరిగింది.