చేనేత సమస్యల పరిష్కార దిశగా చీరాల – దేశాయిపేటలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు

చీరాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, చేనేత కళాకారుల జీవితాలు ఆర్థికంగా బలపడాలంటే పట్టు, సిల్క్ మీద విధిస్తున్నటువంటి అధిక జీఎస్టీలను తగ్గించాలని తద్వారా చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతూ చేనేత నాయకుడు మాచర్ల మోహన్ రావు ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర చేనేత జన సమాఖ్య సంఘం ప్రతినిదులు గత ఐదు రోజులుగా దేశాయిపేట నందు నూలు మిల్ సెంటర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం పూర్తిగా చేనేత మహిళల చేత నిర్వహించబడుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియపరిచిన జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ నాయకులు. దీక్ష చేస్తున్న చేనేత మహిళ కళాకారుల ద్వారా సమస్యలన్నిటిని తెలుసుకోవడం జరిగినది. సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకి నివేదిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బూడిద వరం మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాలతో పవనన్న చేనేత బాట కార్యక్రమం ద్వారా గత 11 నెలలుగా ఇంటింటికి తిరుగుతూ చేనేత కళాకారులు/కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంకలనం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అలానే బూడిద వరం మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు మీద డిమాండ్ పెరగాలంటే స్థానికంగా ఉన్నటువంటి చేనేత నాయకులంతా కలిసి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి, ప్రజానీకానికి చేనేతలు, చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు తెలియపరిచి వాళ్లంతా సొంతంగా చేనేత వస్త్రాలు ధరించే విధంగా కార్యచరణ చేస్తే బాగుంటుందని రాష్ట్ర చేనేత జన సమైఖ్య నాయకులకు చెప్పడం జరిగినది. ఈ విధంగా వస్త్రధారణ విషయంలో ప్రజలలో ఆలోచనలు మార్పు తీసుకు రాగలిగితే వచ్చి చేనేతకు డిమాండ్ పెంచిన వాళ్ళం అవుతాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున కె.సిద్దు, శివరాత్రి రాము, కె.నిఖిలేష్, బత్తిన బాలాజీ, తులం వెంకట సాయినాధ్, రామిశెట్టి శ్రీకాంత్, పసుపులేటి సాయి, దోగుపర్తీ లలిత్ కుమార్, బుద్ధి శివ కిరణ్, పింజల సంతోష్ మరియు పర్చూరు నియోజకవర్గ జనసేన నాయకుడు తోట అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.