పామర్రు జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

పామర్రు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం నియోజకవర్గస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి పరింగిశెట్టి కీర్తన ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.