ముమ్మిడివరం జనసేన-టిడిపి ఆత్మీయ సమావేశం

బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశం గురువారం ఇరుపార్టీ శ్రేణులు ఏర్పాటుచేయడం జరిగింది. రాష్ట్ర ఇరుపార్టీల సమన్వయ కమిటీ ఆదేశాలమేరకు ముమ్మిడివరం తాడి నరసింహారావు ఇంటి వద్ద జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ గంటి హరీష్ మధుర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీ నాయకులు భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది భవిష్యత్తులో గ్రామస్థాయిలో ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ఇరు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి వైసిపి రహిత నియోజకవర్గంగా చెయ్యాలని ఇరు పార్టీలు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), ఉభయ తూర్పుగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి రమా కేశవ బాలకృష్ణ (జమి), గోదాశి పుండరీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, ముమ్మిడివరం నగరపంచాయితీ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు(కొండ), ఉప్పూడి సర్పంచ్ రంబాల రమేష్, ఎంపిటిసిలు లంకెలపల్లి జమి, ఉండ్రు సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, వీరమహిళలు, అభిమానులు, వివిధ కమిటీలకు సంబందించిన తెలుగుదేశం పార్టీ వారు పాల్గొన్నారు.

పలువురిని పరామర్శించిన పితాని

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన అనారోగ్యంతో ముమ్మిడివరం శరణ్య హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు పెమ్మాడి శ్రీను భార్య రత్నకుమారిని, ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు గ్రామానికి చెందిన ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న అయినవిల్లి నాగరాజును, అలాగే ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన అనారోగ్యంతో చికిత్సపొందుతున్న మోటుపల్లి నాగేశ్వరరావుని ముమ్మిడివరం శరణ్య హాస్పిటల్ నందు పరామర్శించిన జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, మోకా బాలప్రసాద్, దూడల స్వామి, ఓగూరి భాగ్యశ్రీ, సంసాని పాండురంగారావు, గిడ్డి రత్నశ్రీ, ఓగూరి నూతన్ బాబు, సంగాని ధర్మారావు, కాలాడి రాజు, ఒలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.