మున్సిపల్ అధికారుల తీరుపై కలెక్టర్ కు మలగా రమేష్ వినతి

  • ప్రోటోకాల్ పాటించడం లేదు
  • ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు
  • 38వ డివిజన్లో మున్సిపల్ పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలి
  • వైకాపా నేతలతో కుమ్మకై పార్క్ నిర్మాణం నిలిపివేత
  • జిల్లా కలెక్టర్కు 38వ డివిజన్ జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ ఫిర్యాదు
  • సానుకూలంగా స్పందిన కలెక్టర్ దినేష్ కుమార్

ఒంగోలు: మున్సిపల్ యంత్రాంగం తీరు బాగాలేదని, అధికార పార్టీ నేతలతో కలిసి డివిజన్లో అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు 38వ డివిజన్ జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ ఫిర్యాదు చేశారు. డివిజన్లోని సమస్యలను, వైకాపా నేతలతో కలిసి మున్సిపల్ అధికారులు చేస్తున్న అవినీతి బాగోతాన్ని వినతి రూపంలో ప్రకాశం భవనంలో కలెక్టర్ను కలిసి మలగా రమేష్
వివరించారు. అర్జీ సారాంశాన్ని పరిశీలిస్తే.. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తారని నాపై నమ్మకం ఉంచుకొని డివిజన్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కాని మున్సిపల్, వార్డు సచివాలయ ఉద్యోగుల తీరు నన్ను ఎంతగానో బాధిస్తుంది. సచివాలయంలో జరిగే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తనకు ఆహ్వానం లభించడం లేదు. డివిజన్లో జరిగే ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఫోటోకాల్ పాటించకుండా తనను అవమాన పరుస్తున్నారు. డివిజన్లో రూ 40 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కూడా పిలవడం లేదు. అంతే కాకుండా 38వ డివిజన్ చుట్టుపక్కల అన్ని డివిజన్లు పర్యటించి 38 డివిజన్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తమ డివిజన్లో మాత్రం ఇంత వరకు పర్యటించలేదు. 38వ డివిజన్ పరిధిలోని ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ వెంచర్లోని సర్వే నం. 118/1 ఎల్పీ నం. 100/78లో మున్సిపాలటికి సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలం చుట్టు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తూ హఠాత్తుగా పనులను నిలుపుదల చేశారు. ఎందుకు చేశారో కూడా మున్సిపల్ యంత్రాంగం సరైన సమాధానం చెప్పలేకపోతుంది. సచివాలయ ఉద్యోగులు, మునిసిపల్ అధికారులు ఫోటోకాల్ పాటించడం లేదంటూ పలు మార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా, ఇంత వరకు ఎలాంటి స్పందన కనిపించడలేదు. సచివాలయ సెక్రటరీల పని తీరు సరిగ్గా లేనందున వారి మీద కంప్లైంట్ ఇచ్చిన కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 38వ డివిజన్లో సమస్యల మీద ఎన్ని సార్లు అర్జీ ఇచ్చిన కూడా సమస్యలను పరిష్కరించడం లేదు. వాలంటీర్ ఇంటర్వ్యూ జరిగి దాదాపుగా 3 నెలలు అవుతున్న కూడా ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. కమర్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ షాప్ లు కడుతున్నారని కంప్లైంట్ పెట్టిన కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆది నుండి 38వ డివిజన్ మీద మునిసిపల్ అధికారులు కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా తమ డివిజన్లోని సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూనే హక్కు నాకు ఉంది. కాని మున్సిపల్, సచివాలయ ఉద్యోగుల తీరు నా హక్కులు కాలవ్రాసేలా ఉన్నందున, తమరి దృష్టికి తీసుకొస్తున్నాను. కార్పొరేటర్ హెూదాలో ఉన్న నా హక్కులను కాపాడేలా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి రూపంలో కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రోటోకాల్ సమస్య రాకుండా డివిజన్లో చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.