పురపాలక కౌన్సిల్ సమావేశాలు ప్రజా ప్రయోజనాలకోసం జరగడంలేదు: శెట్టిబత్తుల

అమలాపురం, పురపాలక సంఘంలో సమావేశాలు ప్రజా ప్రయోజనాల కోసం జరగడం లేదని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. కేవలం ప్రజలు వివిధ పన్నుల రూపాలలో కట్టిన లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. చైర్ పర్సన్ కు కూడా తెలియకుండా అజెండా రూపకల్పన చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ప్రజల సొమ్మును అధికారపార్టీ నాయకులు కొంతమంది పురపాలక అధికారులు వాటాలుగా పంచుకుంటున్నారు. పట్టణ అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం బిల్లులు ఆమోదింపచేసుకోడానికే నెలవారీ సమావేశాలు నిర్వహిస్తున్నరన్నారు. ప్రతిపక్ష కౌన్సిలర్ల గొంతు అణచివేయడానికి అధికారపార్టీ కౌన్సిల్సర్ల ప్రయత్నం. చాలా సందార్భాలలో ప్రతిపక్ష కౌన్సిలర్ల డిసెంట్ కూడా తీసుకోవడంలేదు. ప్రతిపక్ష కౌన్సిలర్ల పట్ల అధికారులు చులకన చూపు చూస్తున్నారు. ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడిన నాటినుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణకు జనసేన డిమాండ్ చేస్తోంది. కౌన్సిల్లో జనసేన కౌన్సిలర్ల పోరాటం స్ఫూర్తి దాయకం. త్వరలోనే మా కౌన్సిలర్లతో కలసి పురపాలక అధికారుల అవకతవకలపై, అవినీతిపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయనున్నామని శెట్టిబత్తుల రాజబాబు తెలిపారు.