మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి..

గత ఏడాది చేపట్టిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రకియ సందర్భంలో అధికార పక్షం దౌర్జన్యాల మూలంగా ఎంతోమంది నిజాయితీపరులు పోటీకి దూరమైపోయారు. ఆ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడే మొదలుపెట్టడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునరాలోచన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కోరారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడం సంతోషమే. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే ప్రారంభిస్తామని చెప్పడం మాత్రం అసంతృప్తినిచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఏ స్ఫూర్తినైతే జన సైనికులు, ఆడపడుచులు, నాయకులు చూపించారో అదే స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించి విజయం సాధించాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.