ఈ నెల 6న ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లోని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికీ చేయుతగా వారిని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన మరో కొత్త పధకం జగనన్న తోడు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 9.08 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10వేల వరకు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించనున్నారు. ఇందుకుగాను రూ.474 కోట్లను ప్రభుత్వం ఇవ్వగా వాటిపై అయ్యే వడ్డీ రూ.52 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసారు.