ప్రేర్రాజు పేట ప్రాంతంలో మున్సిపల్ స్కూలును పునరుద్ధరించాలి..

  • నాడు-నేడు అభివృద్ధి పనుల పరిశీలనలో జనసేన నాయకులు

కాకినాడ సిటీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బుధవారం పి.ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రేర్రాజు పేట ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ బస్ కాంప్లెక్స్ ఎదురు వీధిలో ఉండే మునిసిపల్ స్కూల్ ని చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని చూసి విస్తుపొయారు. ఆ స్కూలుని మూసివేయడం వల్ల ఆ స్కూలు భవనాలు మొత్తం శిధిలమైపోయి, ఆ ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి దీనస్థితిలో ఉంది. ఈ స్కూలు వ్యవస్థాపకులు కరుసూది అప్పారావు విగ్రహం వద్ద స్కూలు మళ్ళీ తెరవాలని నిరసన చేపట్టి ఆప్రాంత ప్రజల వద్ద ఈ స్కూలు పునరుద్ధరించాలన్న వినతిపత్రాలపై సంతకాల సేరణ చేపట్టారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ వార్డుల్లో సచివాలయాలు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు మొదలైన వాటికోసం గతకొద్దిరోజులుగా స్కూళ్ళు మూసి నిర్మించడం చూసామని, ఇప్పుడు సరికొత్తగా స్కూళ్ళు మూసేసి ఆప్రాంగణాలని విషపురుగులకి ఆవాలంగాను, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగాను వదలడం చూస్తున్నామన్నారు. తద్వారా ఈ ఆస్థి అన్యాక్రాంతమవుతుందని ఆలోచించరా అన్న సందేహం ఈ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తుంటే వై.సి.పి ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తోందన్నారు. పిల్లల మనోవికాశానికి దోహద పదే విద్యని కుంటుపడేలా తీసుకుంటున్న వై.సి.పి ప్రభుత్వ నిర్ణయాలని జనసేన పార్టీ ప్రజల తరుపున తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటీ వైస్ ప్రెసిడెంట్లు అడబాల సత్యనారాయణ, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, మాజీ కార్పోరేటర్ ర్యాలీ రాంబాబు, సిటి కమిటీ నాయకులు దాసరి సత్తిరాజు,కంట రవిశంకర్,లోవరాజు, సమీర్, ముత్యాల దుర్గాప్రసాద్, వరద దొరబాబు వార్డు అధ్యక్షులు శ్రీమన్నారాయణ, మండపాక దుర్గాప్రసాద్, మనోహర్లాల్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, నాయకులు దారపు సతీష్, నర మణికంఠ, తోట నరసింహా కుమార్, సతీష్, మోస ఏసుబాబు, చీకట్ల వాసు, వెంకటేశ్వర్లు, మాలతి తదితరులు పాల్గొన్నారు.