జనసేన పార్టీ జగిత్యాల మండల కమిటీ అధ్యక్షులుగా బొల్లి రాము నియామకం
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీనీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డీ, రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ ల ఆదేశాల మేరకు జగిత్యాల నియోజక వర్గం, జగిత్యాల మండలం, కమిటీలు ఏర్పాటు భాగంలో జనసేన పార్టీ జగిత్యాల మండలం కమిటీ సభ్యులని నియమించగా అధ్యక్షులుగా బొల్లి రాము ప్రధాన కార్యదర్శిగా పత్తి అజిత్ కృష్ణ నియమించినట్లు జగిత్యాల నియోజవర్గం కోఆర్డినేటర్ బెక్కం జనార్ధన్ ఒక ప్రకటనలో తెలుపగా.. ఈ సందర్భంగా బొల్లి రాము మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తామనిి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జగిత్యాలలో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతామని త్వరలో గ్రామ కమిటీ కూడా నియమస్తామని అని అన్నారు. నా నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.