మున్సిపల్ కార్మికుల డిమాండ్లను తీర్చాలి: అళహరి సుధాకర్

కావలి: రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా గురువారం కావలిలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ తరుపున నాయకులలో కలిసి కావలి ఇంఛార్జి అళహరి సుధాకర్ వారి దీక్షలో, రాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలపారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ న్యాయమైన రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్లు సీ ఎం అయితే జగన్ రెడ్డి వాళ్ళను పర్మినెంట్ చేస్తాను అన్నారు. అది చెయ్యక పోగా ఎక్కడ చూసినా ధర్నాలు, రాలీలతో, ఈ పి ఐ మొత్తం నిరసనలే, వైసీపీ ప్రభుత్వం వెంటనే వీరి కనీస వేతనము 25000ల రూపాయలు ఇవ్వాలని, డైలీ వేజెస్ కార్మికులను అవుట్ సోర్సింగ్ లో చేర్చాలని, పెన్షన్ విధానం అమలు చెయ్యాలని జనసేన పార్టీ తరుపున వారి డిమాండ్ లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ, చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్న ఈ చెత్త వైసీపీ.. కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు చేస్తే వారిని పట్టుఒచుకోరా అని నిలదీయడం జరిగింది. ఈ కార్యక్రమములో టౌన్ అధ్యక్షుడు పోబ్బా సాయి, ఉపాధ్యక్షుడు నాగార్జున, కో-ఆర్డినేటర్ తిరుమలశెట్టి సుధీర్, కావలి అధికార ప్రతినిధి రిషికేశ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు ఆలా శ్రీనాథ్, నాయకులు మస్తాన్, కృష్ణయ్య, మల్లి, శరణ్, జాన్ ప్రభాకర్, మురళి, శ్రీను, జానీ, రూరల్ వేంకయ్య తదితరులు పాల్గొన్నారు.