ముప్పిడి వెంకటేశ్వరరావుని గెలిపిస్తా: టీవీ రామారావు

కొవ్వూరు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం టీవీ రామారావుని జనసేన నాయకులు మరియు జనసైనికుల సమక్షంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తదుపరి ఇరు నాయకులు మాట్లాడుతూ జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావుని ఉమ్మడి కార్యాచరణతో నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ తాను కూడా అభ్యర్థి రేసులో ఉన్నా గాని పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు సంయుక్త నిర్ణయం కొరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి అలకలు తావు లేవని వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుని తానే దగ్గర ఉండి గెలిపిస్తానని హామీ ఇచ్చారు.