శేషాబ్ గలీ ప్రాంతంలో ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 34వ డివిజన్లో శేషాబ్ గలీ ప్రాంతంలో జనసేన పార్టీ ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలోను, 21వ డివిజన్లో మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలోను నిర్వహించడం జరిగినది. ఈ యాత్రలో జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ముస్లింల కోసం సచార్ అనే ఒక కమిటీ ఏర్పడి కొన్ని సూచనలతో ఒక రిపోర్టుని సమర్పించిందనీ వాటికి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలంటూ 2019లో పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారనీ, ఇందులో ముస్లిం వర్గాలు నేటి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కొన్ని సిఫార్సులు చేయడం జరిగిందనీ వాటికి చట్టబద్ధ ఇచ్చి అమలుచేయాలని కోరుతున్నామన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం ముస్లింల సంక్షేమంపై శ్రద్ధ చూపట్లేదనీ, కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని దీనిని తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొయినుద్దీన్, ఎస్.కె బషీర్, ఎస్.కె.రోషన్, సయ్యద్ బాజీ, ఎం.డిజాఫర్, అజారుద్దీన్, బషీర్, రజియా సుల్తానా, హుస్సేన్, ఎండి భాష షేక్, కరీముల్లా, తదితరులు పాల్గొన్నారు.