గాంధీ మహాత్మునికి ఘన నివాళులర్పించిన ముత్తా శశిధర్

కాకినాడ సిటి: కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో మంగళవారం జగన్నాధపురం వెంకటేశ్వర స్వామి మందిరం ప్రాంతంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలోను, 20 డివిజన్ ముత్తానగర్ గాంధీ సెంటర్ ప్రాంతంలో వార్డు అధ్యక్షులు బస్వాని నాగబాబు ఆధ్వర్యంలోను, పర్లోపేట ప్రాంతంలో సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ ఆధ్వర్యంలోను దుమ్ములపేట వార్డు అధ్యక్షులు దాసరి వీరబాబు ఆధ్వర్యంలోను జరిగిన కార్యక్రమాలలో ముత్తా శశిధర్ పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం మేము సిద్ధం కార్యక్రమాన్ని జరపడం జరిగినది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంకోసం గాంధీ మహాత్ముడు చేసిన పోరాటం అందరికీ ఆదర్శమనీ, అహింసతో కూడా పోరాటం చేసి మన ఆశయాలని సాధించవచ్చని ఋజువు చేసారన్నారు. మన భావితరాలకి ఈస్పూర్తిని అందచేయడం ప్రతిఒక్కరి కర్తవ్యమన్నారు. దురదృష్టవశాత్తూ మహాత్ముని సహచరులు ఐన భారతదేశ ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు గారి విగ్రహాన్ని, నేతాజీ సుభాష్ చంద్రబోసు విగ్రహాలను మన జగన్నాధపురంలో ద్వారంపూడి తీసివేయించారనీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ రాబోయే 60 రోజుల తరువాత ఈ జగన్మోహన రెడ్డికి, ద్వారంపూడికి, వై.సి.పి కి పుల్ స్టాప్ పెడుతున్నామనీ అందుకు మేము సిద్ధమనీ, ప్రజలు కూడా సిద్ధమని చెపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు దుగ్గిన బాబ్జీ, శ్రీమన్నారాయణ, పినిశెట్టి సురేష్, మల్లిపూడి శివాజీ, అక్షయ దుర్గ ప్రసాద్, బసవాణి నాగబాబు, పెద్దిరెడ్డి రాజేష్, వరిపిల్లి ప్రసాద్, మోస ఏసేబు, దూడ తాతారావు, ఆది నారాయణ, అమర్నాథ్ దుర్గాప్రసాద్ బోడ పాటి మరియ, పెద్దిరెడ్డి సంతోషి, చోడిపల్లి సత్యవతి, సోనీ ఫ్లోరెన్స్, దారపు శిరీష, రచ్చా ధనలక్ష్మి, దీప్తి, తనంచింతల రమ్య మరియు సిటీ నాయకులు, వార్డు ఇంచార్జ్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.