కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో మంగళవారం మేము సిద్ధం కార్యక్రమం డైరీ ఫాం సెంటరు వద్ద డివిజన్ అధ్యక్షులు జంప అప్పలరమణ ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ నేటి ప్రజా జీవితంలో కరెంటు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తోందనీ, దాని సరఫరా మరియు ఉత్పత్తి నిర్వహణా తదితరములు ప్రభుత్వమే చేపడుతుందనీ అన్నారు. మరి అలాంటి వాటిని ప్రభుత్వం వ్యాపారం లాగ చేస్తే ప్రజలు నానా నరకయాతన పడుతున్నారనీ అందుకు సాక్ష్యం నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం హయాములో ఇప్పటి వరకు సుమారు 8 సార్లు పెంచిన విధ్యుత్ చార్జీలే నిదర్శనం అన్నారు. అసలెయ్ ఒకపక్క సంపాదన అవకాశాలు పరిస్థితులు జఠిలముగా ఉన్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఎప్పుడో పంపిణీ చేసిన కాలంలోని బిల్లుల చార్జీలను ఇప్పుడు వేస్తూ ముక్కుపిండి వసూలుచేయడం తీవ్రమైన అన్యాయం అనీ, అందుకే ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మేము సిద్ధం అని చెపుతున్నారనీ అన్నారు. ఇక ఉన్నది 60 రోజులు మాత్రమే అని ఈ పీడ పొడానికి తమ ఓటుతో సమాధానం చెప్పడానికి మేము సిద్ధం అని నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, కిషోర్ కుమార్, బొద్దు రాజు, పెమ్మాడి దుర్గారఒ, కర్రి సత్యసాయి, సురేష్,బడగంటి సురేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.