గ్రామ గ్రామాన జనసేన సిద్దాంతాలు తెలియజేయటమే నా లక్ష్యం: కిల్లో రాజన్

పాడేరు నియోజకవర్గం: జి. మాడుగుల మండలం వంజరి పంచాయితీ ముల్కేయిపుట్, గాలిపాడు, కొత్తురుపాడు గ్రామాలకు చెందిన ముఖ్యమైన యువకులతో కలవడం జరిగింది. యువతకి చైతన్యం చేసి, కొత్త తరహా రాజకీయాలకు పురిగొల్పి, ఆదివాసి జాతిని కాపాడుకోవడమే ప్రధాన ధ్యేయంగా, గిరిజన జాతి మనుగడకోసం మన జాతికి అంబేడ్కర్ ఇచ్చిన హక్కుల రక్షణ కోసం చేస్తున్న పోరాటంలో యువత భాగస్వామ్యం విషయమై యువతి యువకులకు చైతన్యం కల్పిస్తు మాతో పాటు జనసేన పార్టీలో బాగస్వామ్యం చేస్తూ ఎందరోత్యాగ దనుల పోరాట ఫలితమే మన స్వేచ్ఛాజీవితలకు వారదని ఆనాటి వారి పోరాట పటిమ బడుగు బలహీనుల ప్రజల బ్రతుకుల మార్పుకోసం అయితే నేడు రాజకీయ రణక్షేత్రంలో అణగారిన వర్గాల ప్రజలకోసం పోరాడు తున్న పవన్ కళ్యాణ్ గారి ఉద్యమ స్ఫూర్తితి నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని అన్యాయాన్ని, అసమర్ధతతో ఎదిరించకుండా అవినీతి రాజకీయాలను ప్రశ్నించకుండా, అధర్మాన్ని, అక్రమాన్ని ప్రశ్నించకుండా ఉండటం, కులాల మధ్య విబజించి పాలించే దురాచారదుష్ట శక్తులను మట్టి కరిపించి రూపు మాపడమే లక్ష్యంగా చేయి చేయి కలపాలన్నారు. యువతను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముందుకు నడిపించడమే మా కర్తవ్యమని తుది శ్వాస వరకు గిరిజన జాతి అస్తిత్వానికి రక్షణగా నిలుద్దామని పాడేరు నియోజకవర్గ జనసేన జాయింట్ సెక్రటరీ కిల్లో రాజన్ పేర్కొన్నారు.