పేడాడ రామమోహన్ ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

ఆముదాలవలస, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ జనసేన నాయకులు పేడాడ రామమోహన్ పొందూరు మండలంలో జనసైనికులకు మరియు నాయకులకు నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరిస్తూ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచనలిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.