మానవత్వం చాటుకున్న నాగర్ కర్నూల్ జనసేన

  • మనవత్వానికి మారుపేరు పోతిరెడ్డిపల్లి జనసైనికులు
  • భారీ వర్షాల వల్ల కూలిపోయిన నివాసాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మజ్ పెట్ మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామస్తుడు కుమ్మరి భీమయ్య ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ మరియు పోతిరెడ్డిపల్లి గ్రామ జనసైనికులు కూలిపోయిన నివాసాన్ని సందర్శించి, ఆ యొక్క కుటుంబ సభ్యులను కలిసి కన్నీళ్లు తుడిచి, వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలిపోయిన ఆ నివాసాన్ని ఒక రెండు గదుల రేకుల ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి జనసైనికులు విజయ భాస్కర్ గౌడ్, ఎడ్ల శివుడు, ఎడ్ల ప్రసాద్, ఎస్.కె అల్తాఫ్, పవన్, పి శివ, టి బాలకృష్ణారెడ్డి, ఎం శ్రీకాంత్, బి ఆదిమోహన్, ఆవుల రాములు, జీవన్ కుమార్, వి గోపి తదితరులు పాల్గొన్నారు.