తడిసిన పంట నష్టపరిహారం చెల్లించి రైతు లను ఆదుకోవాలి

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండల, మట్టపర్రు, లక్కవరం గ్రామాలలో మురికి నీరు కాలువలు నేరుగా పంట పొలాల్లోకి చేరి అక్కడి రైతుల పాలిట శాపంగా మారింది. రైతు నాయకులు మంగెన నరసింహారావు ఆద్వర్యంలో మురికి నీరు ప్రవహించి చేతికి అందాల్సిన వరి పంట పూర్తిగా తడిసిపోయి నష్టపోయిన రైతులను కలిసి వారి నుంచి పంట నష్టం అంచనా వివరాలు తెలుసుకుంటున్నారు. మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఎంపీపీ శ్రీమతి మేడిచేర్ల వెంకట సత్యవాణి రాము ఈ కార్యక్రమంలో పాల్గొనీ రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు, రైతులు తమ పంట పూర్తిగా తడిసిపోయి నష్టపోయాము అని వాపోయారు, ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మురికి నీరు ప్రవహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. రైతు నాయకులు మంగేన నరసింహారావు రైతులు కాలువలలో ఉన్న పూడిక పనులు స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు అని ఆయన చెప్పారు.