Nainital Bank 155 పీవో‌, క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

‌బ్యాంక్ ఆఫ్‌ బ‌రోడా అనుబంధ సంస్థ అయిన నైనిటాల్‌ బ్యాంకులో 155 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ బ్యాంకు ఉత్త‌ర‌ఖండ్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. ఆశక్తి కలిగినవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://www.nainitalbank.co.in/ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరితేది. సెప్టెంబర్‌ 15, 2020.

ముఖ్య సమాచారం:

పోస్టుల పేరు: ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌, క్ల‌ర్క్‌ ఉద్యోగాలు

మొత్తం పోస్టులు: 155 (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్-75, క్ల‌ర్క్‌-80)

అర్హ‌త‌: పీఓకు 50 మార్కుల‌తో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. క్ల‌ర్క్ పోస్టుకు 45 శాతం మార్కుల‌తో డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసి ఉండాలి.

వయసు: పీఓ ఉద్యోగాలకు 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. క్లర్క్‌ ఉద్యోగాలకు 21 నుంచి 38 ఏళ్ల లోపువారై ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారం. రాత‌ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు ఫీజు: పీఓ పోస్టుకు రూ.2000, క్ల‌ర్క్ పోస్టుకు రూ.1500 (జీఎస్టీతో కలిపి)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 15, 2020

వెబ్‌సైట్‌: https://www.nainitalbank.co.in/