సోమశిల పవర్ ప్లాంట్ ని సందర్శించిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూర్ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్, రవి ఉదయగిరితో కలిసి సోమశిల పవర్ ప్లాంట్ ని సందర్శించారు.ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆర్.వి రమణ రెడ్డి, వల్లూరు శ్రీనివాస్ చౌదరి, ప్రధాన కార్యదర్శి కత్తి పెంచలయ్యలకు నలిశెట్టి శ్రీధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. పవర్ ప్లాంట్ సింహపురికి గర్వకారణమని శ్రీధర్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాగరాజు యాదవ్, చేజర్ల ఇంచార్జ్ అనిల్ రాయల్, సోమశిల జనసేన నాయకులు లక్ష్మీ కుమార్ గౌడ్, ఆత్మకూర్ టౌన్ నాయకులు వేణుగోపాల్, వంశీ, సంగం మండల ప్రధాన కార్యదర్శి మదన్ యాదవ్, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.