పదవి పోయిన ఫ్రస్టేషన్ పేర్ని: ఎస్ వి బాబు

పెడన, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు పదవి పోయిన మనోడి నోటి దూల తగ్గలేదు. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. తన యజమానిని సంతృప్తిపరచి మళ్లీ మంత్రి పదవి కొట్టాలని చూస్తున్నాడు. కానీ పేర్ని నాని పాచిపోయిన బిర్యాని, కూరలో కరివేపాకు. మనోడికి ఇక రెస్టే. పవన్ కళ్యాణ్ మీద ఇదేవిధంగా నోరు పారేసుకుంటే, సత్య దూర ఆరోపణలు చేస్తే ఈసారి పేర్ని ఎమ్మెల్యే కూడా కాలేడు. ఆర్.ఐ.హెచ్ – రెస్ట్ ఇన్ హౌస్. మనోడు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ ఓ వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆశాకిరణం. నీలాంటి అల్పులకు అర్థంకాని మహోన్నతమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది. సమాచారం లేని సమాచార మంత్రిగా పేర్ని నాని పదవిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని గానీ, తన నియోజకవర్గానికి కానీ, తనను నమ్మి ఓటేసిన ప్రజలకు గానీ ఒక్క పని కూడా చేయలేదు. బందరు పోర్టు పేరుచెప్పి, కులం కార్డు వాడుకుని మంత్రి అయిన నిన్ను రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం ప్రజలు బంగాళాఖాతంలో కలపడం తథ్యమని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.