తిరుపతి జిల్లాను దొంగ ఓట్ల జిల్లాగా నామకరణం చేయండి సీఎం గారూ!

  • రానున్న ఎలక్షన్లలో అవినీతికి పాల్పడితే వాలంటీర్లపై చర్యలు తప్పవు
  • దొంగ ఓట్లకు సహకరించిన అధికారులతో సహా వారి చేత చేపించిన నేతల పై చర్యలు తీసుకోవాలి, వారిని అనర్హులుగా ప్రకటించాలి
  • జనసేన నేత కిరణ్ రాయల్

తిరుపతి: తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదవడంపై, వాటికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయడంపై జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా ముఖంగా మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాను దొంగ ఓట్ల జిల్లాగా నామకరణం చేయండి సీఎం గారు అంటూ ఎద్దేవా చేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంట్లో సుమారు 6 నుంచి 10 వరకు దొంగ ఓట్లు ఉన్నాయని, వీటిపై ఎలక్షన్ కమిషనర్ కొందరు అధికారులను సస్పెండ్ చేసిందని, అధికారులనే కాదు దొంగ ఓట్లను నమోదు చేయించిన నేతలపై కూడా చర్యలు తీసుకొని వారిని రానున్న ఎలక్షన్లలో అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేపు రానున్న ఎలక్షన్లలో గ్రామ వాలంటీర్లు అధికార పార్టీకి సహకరించి, అవినీతికి పాల్పడితే వచ్చే కొత్త ప్రభుత్వంలో చర్యలకు గురికాక తప్పదన్నారు. ఎలక్షన్ కోడ్ రానున్న సమయంలో ముందుగా గ్రామ వాలంటీర్లకు ప్రజాధనం 500 కోట్లను పంచిపెట్టడంపై.. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలనే భావన కలుగుతుందని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. 35వేల పైచిలుకు దొంగ ఓట్లు తిరుపతిలో ఉన్నాయని, గతంలో మేము చెప్పిన విధంగా ఎంపీ గురుమూర్తికి రాయలసీమ మొత్తం గొంగ ఓట్లు వేసి గెలిపించారని ఆయన అన్నారు. ఎక్కడైనా అధికారులు, రాజకీయ నేతలు దొంగ ఓట్లకు పాల్పడినట్లయితే, రానున్న మా ప్రజా ప్రభుత్వంలో వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నగర అధ్యక్షుడు రాజా రెడ్డి, హేమ కుమార్, కొండా రాజమోహన్, సుమన్ బాబు, రాజేష్ ఆచారి, వంశీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.