అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ కు నంద్యాల జనసేన మద్ధతు

నంద్యాల జిల్లా, నంద్యాల నియోజకవర్గం, ఐదవ రోజు జరుగుతున్న అంగన్వాడి టీచర్ల, ఆయాల నిరవధిక సమ్మెకు జనసేన పార్తీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నంద్యాల జనసేన తరపున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్ల మరియు ఆయాల యూనియన్ చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా నంద్యాలలో ధర్నా చౌక్ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకి జనసేన పార్టీ తరపున మద్దతు తెలిపిన నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సుందర్, చందు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ నోటి దగ్గర అన్నమును లాక్కొని వెళ్లే గజదొంగ ఈ వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాబోవు 2024లో జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీ డిమాండ్లన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ కు జనసేన సుందర్, చందు, హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.