జాతీయ రైతు దినోత్సవ వేడుకలలో నందికొట్కూరు జనసేన

నందికొట్కూరు: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు నల్లమల్ల రవికుమార్ మరియు జనసైనికులు కలిసి నియోజకవర్గ పరిదిలోని రైతులను వారి పొలాల దగ్గరికి వెళ్లి వారు వేసిన పంటలను పరిశీలించడం జరిగింది. రైతులతో నేరుగా చర్చించి వారు వేసిన పంట ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంతవరకు గిట్టుబాటు ధర వస్తుంది అనే విషయాల గురించి చర్చించడం జరిగింది. ప్రతి రైతు మాట్లాడుతూ మా కష్టానికి సరిపడ విలువ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, మేము పడుతున్నటువంటి కష్టాల పట్ల ఆలోచిస్తుంది కేవలం జనసేన పార్టీ అని ప్రతి ఒక్క రైతు చెప్పడం జరిగింది. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం నిస్వార్ధంగా ఆదుకోలేదని, జనసేన పార్టీ మరణించిన ప్రతి కౌలు రైతు కుటుంబాల దగ్గరకు నేరుగా వచ్చి లక్ష రూపాయల సహాయం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్య్క్తం చేసారు. జనసేన పార్టీ బృందం రైతుల యొక్క పంట పొలాల్లో తిరుగుతూ వారి కష్టాలను వింటూ, వారు పడే కష్టాలను చూస్తూ, వారికి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తూ, కౌలు రైతు కుటుంబాల మరణాలు కచ్చితంగా ఉండవని భరోసా ఇస్తూ, రైతులను శాలువాతో గౌరవించి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక రైతే రాజు అవుతారని హామీ ఇచ్చి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.