జనసేన సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకై కొండా సిద్దార్థ్ దేశవ్యాప్త యాత్ర

  • రాయల్ ఇన్ ఫీల్డ్ పై దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టిన కొండా సిద్దార్థ్

జనసేన పార్టీ సిద్ధాంతాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ మరియు జంతు సంరక్షణ, అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన జనసైనికుడు కొండా సిద్దార్థ్ రాయల్ ఇన్ ఫీల్డ్ పై దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాయల్ ఇన్ ఫీల్డ్ షోరూం ఇండియా టూర్ నుండి ప్రారంభమైన యాత్ర దేశవ్యాప్తంగా 45 వేల కిలో మీటర్లు జరగనుంది. ఈ యాత్రను జనసేన పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు నల్లతీగల మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా సిద్దార్థ్ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని మంచిర్యాల జిల్లా కీర్తిని దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని ఆకాంక్షించారు. ఈ రైడ్ ను డ్రీమర్_25 అనే ఇన్ స్టాగ్రామ్ మరియు యుట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించ వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమలేష్ రఘురాం, శ్రీనివాస్, అనుసాయి, తదితరులు పాల్గొన్నారు.