మామిడికుదురు మండలంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మామిడికుదురు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం (మార్చి 8) వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తరపున మహిళా ప్రజా ప్రతినిధులను మరియు వీరమహిళలను సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరమహిళలచే కేక్ కటింగ్ నిర్వహించడం జరిగినది.