చీమలపాడు దుర్ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన నేమురి శంకర్ గౌడ్

ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం, కారేపల్లి చీమలపాడులో కొంతమంది నేతల నిర్లక్ష్యంవల్ల బాణాసంచా నిప్పు రవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం పట్ల జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలి మరియు ఆ కుటుంబాలకు ప్రజా ప్రతినిధులు అండగా నిలబడవలసిందిగా కోరుచున్నామని ఆయన కోరడం జరిగింది.