రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్ కలకలం

బ్రిటన్లో వ్యాపించిన కొత్తరకం కరోనా వైరస్ ఇప్పుడు భారత్ తో పాటు తెలుగు రాష్ట్రాల వారిని కూడా కలవర పెడుతుంది. బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. అయితే ఇది కొత్త రకం కరోనా వైరస్ అని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈనెల 21 వ తేదిన బ్రిటన్ నుంచి ఢిల్లీ కి వచ్చిన మహిళ ఢిల్లీలో ఏపీ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి అక్కడి నుండి కొడుకు తో కలిసి రాజమండ్రికి ఆ మహిళ చేరుకుంది.

అయితే ఆమె యూకే నుండి వచ్చిన విషయం తెలుసుకుని ఆమెకు పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కోవిడ్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో రాజమండ్రి వాసులలో టెన్షన్ వాతావరణం నెలకొంది.