మంత్రి జోగిరమేష్ రాజకీయ జీవితం భూస్థాపితం కావడం తథ్యం: వాసగిరి మణికంఠ

  • వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మూడు పెళ్లిళ్లు ప్రస్తావన
  • చేతనైతే గృహ నిర్మాణ శాఖ గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కాదు.

గుంతకల్లు నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ పై అనిచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై తీవ్రస్థాయిలో వాసగిరి మణికంఠ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ మీ నాయకుడు మెప్పుకోసం పవన్ కళ్యాణ్ మూడు పిల్లల గురించి మాట్లాడడం కాదు, చేతనైతే నీ గృహ నిర్మాణ శాఖ గురించి మాట్లాడుతూ. మీ నాయకుడు సీఎం అయిన వెంటనే రాష్ట్రంలో 28 లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు, మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయితుంది, మీరు పూర్తి చేసిన ఇల్లు గురించి గవర్నమెంట్ సైట్లో పొందుపరచండి, జగనన్న కాలనీలో మౌలిక వస్తువుల కోసం అనే 34 వేల కోట్లు కేటాయించాం అన్నారు. ఇప్పటికీ ఏ కాలనీలో కూడా కనీసం కరెంటు, రోడ్లు, నీళ్లు, వీధి దీపాలు లేవు. జగనన్న కాలనీల కోసం స్థల సేకరణలో 10 లక్షలు 20 లక్షలు విలువ కానీ భూములకు మీ ప్రభుత్వం 60 లక్షల నుండి కోటి రూపాయలు వరకూ చెల్లించి వేల కోట్ల రూపాయల అవినీతికి కుంభకోణానికి పాల్పడింది, మీ జగనన్న ముఖ్యమంత్రి అవుతానే టిడ్కో ఇళ్లు 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నాడు, ఇప్పుటి వరకూ ఎన్ని ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు వీటన్నిటికీ సమాధానం చెప్పు అంతేగాని నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు, ముఖ్యంగా పదవుల్లో ఉన్న మీరు సరైన భాష మాట్లాడకపోతే ప్రజలే రాబోయే రోజుల్లో ఓటురూపంలో తగిన బుద్ధి చెబుతారు ఇప్పటికైనా మారండి అని హితవు పలికారు.