మాడుగుల జనసేన ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

మాడుగుల: గత కొన్ని సంవత్సరాలుగా మాడుగుల నియోజకవర్గంలో జనసైనికులు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ చిత్రపటంతో క్యాలెండర్లు జనసైనికులు పంచేవారు. ఈ సంవత్సరం మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ జనసేన క్యాలెండర్ ను కె కోటపాడు మండల హెడ్ క్వార్టర్ లో సీనియర్ నాయకులు కుంచా అంజిబాబు ఆధ్వర్యంలో కె కోటపాడు మండల జనసైనికులు సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం తధ్యమని ఈ క్యాలెండర్ ప్రతి జన సైనికుల కుటుంబాల్లోకి వెళ్లే విధంగా అతి త్వరలోనే క్యాలెండర్ డ్రైవ్ పేరుతో ప్రతి పంచాయతీలు కూడా ఈ క్యాలెండర్లు పంచే విధంగా కార్యక్రమం చేపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె కోటపాడు మండల జనసైనికులు మజ్జి ఈశ్వరరావు ,రాజు, గణేష్, శ్రీను, సూర్య, మూర్తి, వరహాల రాజు, ముత్యాలనాయుడు, రఫీ, గబ్బర్ సింగ్ ,ఉమా మహేష్, తాత నాయుడు, గౌతం, నాగూరు, నాయుడు , కోటి, పైడ్రాజు, సోమేశు, గంగాధర్, లోకేష్ , శివాజీ, గంగ నాయుడు తదితరులు పాల్గొన్నారు.