పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన కదిరి జనసేన

కదిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం సినిమా ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ కదిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆరు మండలాల నాయకులకు, కార్యకర్తలకు, మెగాఅభిమానులకు సెప్టెంబర్ 1వ తేదీన తనకల్లు మండలంలో జరిగే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు, సేవా కార్యక్రమాల గురించి, సాంసృతిక సాంప్రదాయ నృత్యాల గురించి వివరిస్తూ మనం అంతా కలిసిమెలసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం అంటూ తలుపుల మండలం, ఎన్.పి కుంట మండలం, గాండ్లపెంట మండలం నాయకులకు, కార్యకర్తలకు మెగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమాంబ ఆలయాన్ని సందర్చించి ఆమె చరిత్రను తెలుసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుగు స్థలం కన్వెన్షన్ హాలు ఎదురుగా, కొక్కంటి క్రాస్, తనకల్లు మండలం, కదిరి నియోజకవర్గం, శ్రీ సత్య సాయి జిల్లా తేదీ: 01.09.22 (గురువారం) ఆరు మండలాల అభిమానులు,నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 2.00 గంటల లోపు సభా ప్రాంగణానికి చేరుకోవాలని ప్రతిఒక్కరికీ ఈ వేడుకలకు పేరు పేరునా ఆహ్వానం తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపిటిసి అమర్ కార్తికేయ, కెవి రమణ, భూక్యా రవీందర్ నాయక్, మేకల చెరువు చౌదరి, అన్నం జయ వర్ధన్, మండల నాయకులు, కన్వీనర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మెగాఅభిమానులు పాల్గొన్నారు.