వంగవీటి రంగా జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

గుంటూరు జిల్లా, దాసరి పాలెం గ్రామం, సి.ఆర్.నగర్ కాలనీ వంగవీటి రంగా జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ కార్యక్రమానికి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు విచ్చేసారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు గాదె వెంకటేశ్వర రావుకు ధన్యవాదాలు తెలియజేసారు.