బాలికల వసతి గృహంలో పురుగుల ఆహారం.. వ్యతిరేకించిన జనసేన

గిరిజన బాలికల వసతి గృహంలో పురుగుల ఆహారం పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జనసేన

ఈ సందర్భంగా గిరిజన బాలికల వసతి గృహం సందర్శించిన జనసేన పార్టీ బిసి వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు సరైన వసతి, ఆహారం, మెడికల్ కిట్స్, యూనిఫాం, బుక్స్ తదితర సౌకర్యాలు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా అక్కడే వున్న ఆర్.సి.ఓ మరియు ప్రిన్స్ పాల్ ని ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆహారంలో పురుగులు వచ్చాయని ఎలా తినాలి అని అడుగుతున్నారు. వెంటనే పక్కనే ఉన్న గంగ సోమేశ్వరి టీచర్ విధ్యారుల పై కోపగించుకోవడం, వారిని బెదిరించడం జరిగింది. విద్యార్థులను బెదిరించడం ఏంటి అని అడిగిన నాయకులపై విరుచుకుపడిన టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న వసతి గృహాల పై భాధ్యత వహించాల్సిన అధికారులు. చిత్త శుద్ది కనబర్చక పోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుతున్నయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పే విధంగా పోరాటాలు కొనసాగిస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, బిసి వెల్ఫేర్ అసోసియేషన్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి సంఘం నాయకులు విశాల్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.