సర్పవరం గ్రామ పంచాయతీలో 3 కోట్ల నిధులు గల్లంతు?

  • ఈఓ పరార్, కార్యాలయానికి తాళం, రికార్డులు మాయం

కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ పంచాయతీలో 3 కోట్ల నిధుల అవినీతి జరిగింది. అని వాటి వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది. 30 రోజులు నుండి సమాచారం అడుగుతుంటే ఈరోజు, రేపు అంటూ చెబుతూ ఈఓ బుధవారం 3.00 గంటలకు సమయం ఇచ్చి పంచాయతీ ఆఫీస్ కి వచ్చిన తరువాత తాళంవేసి ఉంది. సెల్ ఆఫ్ లో పెట్టి, పరారైన ఈ.ఓ. ఈ సంఘటన పట్ల కోపంతో గ్రామస్తులు, జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో జనసైనికులు ధర్నా చేసారు. వెంటనే పోలీస్ సిబ్బంది, ఈఓ తనిఖీ చేయగా రికార్డులు గళ్ళంతు విషయం బయటపడింది. ఈ విషయం పై పోలీస్ వారికీ పిర్యాదు చేసి బాద్యులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.