ఋషింగి గ్రామంలో జనసేన తరఫున శ్రీనివాసరావు నామినేషన్

పాలకొండ నియోజకవర్గం:  విజయనగరం జిల్లా, వంగర మండలం, ఋషింగి గ్రామంలో 2వ వార్డు సభ్యుడుగా జనసేన బలపరిచిన అభ్యర్థిగా యలకల శ్రీనివాసరావు నామినేషన్ వెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ మాట్లాడుతూ.. ఈ నామినేషన్ వెయ్యకుండా అధికార పార్టీ అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నలు చేసారు. కాని వారికి భయపడకుండా వాళ్ళని ఎదిరించి నామినేషన్ వెయ్యడం జరిగింది. నామినేషన్ వేసిన తరువాత కూడా విత్ డ్రా చేయంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి మాటలకు ఏమాత్రం భయపడకుండా ఉన్న యలకల శ్రీనివాసరావుకి మరియు రుషింగీ గ్రామ జనసైనుకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను, అలానే రాజాం నియోజకవర్గ ఇంచార్జి నాయుకులు ఎన్ని రాజు గారు ఋషింగి గ్రామ జనసేన నాయకులకి జనసైనికులకి ఎంతో భరోసాని ఇవ్వడం చాలా గొప్ప విషయం. అందుకు ఈ పోరాటంలో తప్పకుండా గెలిచేవిధంగా ప్రతి ఒక్క జనసేన నాయుకులు జనసైనికులు పోరాడాలి అని కోరుకుంటున్నాను అని పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ చెప్పడం జరిగింది.