ఉత్తర అమెరికా జనసేన ఆత్మీయ సమావేశం

ఉత్తర అమెరికా, సెయింట్ లూయిస్ మరియు కాన్సాస్ సిటీ వాళ్ళు చేసిన జనసేన ఆత్మీయ సమావేశంలో చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి డా.పసుపులేటి హరిప్రసాద్, భీమిలి నియోజకవర్గానికి చెందిన డా.సందీప్ పంచకర్ల, ఖమ్మం జిల్లాకి చెందిన సంపత్ నాయక్ జనసైనికులని ఉద్దేశించి జనసేనని ఎలా బలోపేతం చేయాలి, ఎన్నారై జనసైనికులు ఏ విధం గా భారత్ లో ఉన్న తమ కుటుంబ సభ్యులని, బంధువులకి జనసేన సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు చెప్పి వారిని ఓటుగా ఎలా మలచాలి అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు 100 మందికి పైగా జనసైనికులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీకి సుమారు 27 లక్షలు రూపాయలు విరాళాలు ప్రకటించడం జరిగింది. ఏ విరాళాలు ని వారు జనసేన అధికార వెబ్సైట్ ద్వారా తమ తమ విరాళాలు పంపిస్తున్నారు. అక్కడకి వచ్చిన జనసైనికులు అందరు తమ ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. ఈనాటి సభ గొప్ప విజయంగా అభివర్ణించారు. ఉత్తర అమెరికాలో ఇదే మొట్ట మొదట జనసేన ఆత్మీయ సమావేశం ఇదే అనడం అతిశయోక్తి కాదు. ఈ విజయం ఇందరి సమిష్టి కృషికి తార్కాణం. జనసైనికులు ఎవరు కూడా ఇంత పెద్ద విజయం కానీ, సేన కోసం ఇంత సాయం వస్తుంది అని కానీ ఊహించలేదు. చేసిందల్లా పార్టీకి నేను ఏమి చేయగలను అనే తలంపు తప్ప ఒక ఆలోచన దాని తాలూకు ఆచరణ అధినేత చూపిన మార్గం, ఇంత మంది హృదయ స్పందనకి నిదర్శనం. ఈ జనసేన ఆత్మీయ సమావేశం విజయంలో కీలకపాత్ర పోషించన సత్య గాజుల, వెంకట్ అరసాల, విజయ్ సాక్షి, అశోక్ సింగిరికొండ, యల్లమంద అల, శ్రీనివాస్ లొట్టల, శ్రీనివాస్, జమ్ములమడక, నంద పుప్పాల, వెంకట్ బండి, సాయి కృష్ణ తేజ, రామానాయుడు ఎనుముల, పవన్ దాసం, రత్నేశ్వర్ మర్రే, రమణ బెవర, రవి జక్కంపూడి మరియు తదితర జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.