NIE 52 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

చెన్నైలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ (ఎన్ఐఈ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 24, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌తతో పాట నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.‌

వయసు: పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. 30-40 ఏళ్ల మధ్య ఉంటుంది.

వేతనం: రూ.18 వేల నుంచి రూ.64 వేల వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఆగస్టు 24, 2020

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌ ఐడీ: nieprojectcell@nieicmr.org.in

వెబ్‌సైట్‌:http://nie.gov.in/