సెప్టెంబర్‌ 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్న GATE- 2021

బీఈ, బీటెక్, సైన్స్ స్టూడెంట్స్ పీహెచ్‌డీ అడ్మిషన్స్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గేట్–2021 షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఐఐటీ-ముంబై విడుదల చేసింది. గతంలో ఇంజినీరింగ్, సైన్స్ స్టూడెంట్స్ కు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండే గేట్ ఎగ్జామ్‌‌‌‌కు ఈసారి ఆర్ట్స్‌ స్టూడెంట్స్ రాసేందుకు అవకాశం కల్పించారు.

ఈ అకడమిక్ ఇయర్ నుంచి హ్యుమానిటీస్ అండ్‌ సోషల్‌‌‌‌ సైన్సెస్‌ చదివే స్టూడెంట్స్ గేట్ రాయవచ్చని ఐఐటీ ముంబయి కొత్త రూల్స్ తీసుకువచ్చింది. 2021, ఫిబ్రవరి 5,6,7,12,13,14 తేదీల్లో గేట్‌-2021 ఎగ్జామ్‌ను నిర్వహించనుంది. అయితే తాజాగా ఈ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్‌ బ్రోచర్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాలను https://www.gate.iitb.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

GATE Online Application Processing System (GOAPS) వెబ్‌సైట్‌ సెప్టెంబర్‌ 14, 2020 నుంచి ఓపెన్‌ అవుతుంది.

అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్‌ 30, 2020 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.

ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 7, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలకు సంబంధించిన మార్పులను నవంబర్‌ 17, 2020 వరకు చేసుకోవచ్చు.

జనవరి 8, 2021 నుంచి అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2021, ఫిబ్రవరి 5,6,7,12,13,14 తేదీల్లో గేట్‌-2021 ఎగ్జామ్‌ ఉంటుంది.

మార్చి 22, 2021 ఫలితాలను విడుల చేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.gate.iitb.ac.in/