రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ రైల్వేకు చెందిన ఇన్‌స్టిట్యూట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nrti.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 39

ప్రొఫెసర్- 5

అసోసియేట్ ప్రొఫెసర్- 10

 అసిస్టెంట్ ప్రొఫెసర్- 15

డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్- 1

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 1

 అసిస్టెంట్ లైబ్రేరియన్- 1

అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్- 2

 జూనియర్ అసిస్టెంట్- 2

దరఖాస్తు ప్రారంభతేదీ: 2020 అక్టోబర్ 11

దరఖాస్తు చివరి తేదీ: 2020 నవంబర్ 10

విద్యార్హతలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి. కనీసం 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన ఆధారాలుండాలి. ప్రొఫెసర్‌గా 5 నుంచి 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఇతర పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ, అనుభవం తప్పనిసరి.

వయస్సు- 55 ఏళ్ల లోపు ఉండాలి