నేటితో ముగియనున్న LRS తుది గడువు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అనధికార లేఅవుట్ల, ప్లాట్ల క్రమద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది.. అయితే,

ఎల్ఆర్ఎస్ తుది గడువు నేటి (అక్టోబర్ 15)తో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తే.. ఎల్ఆర్ఎస్ తుది గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిక్కుల్లో పడకూడదంటే నేడు ఎల్ఆర్ఎస్ చేసుకోవడం ఉత్తమం.

అక్టోబర్ 14 సాయంత్రం వరకు 16,28,844 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో గ్రామ పంచాయతీల పరిధిలో 6,67,693 దరఖాస్తులు, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్‌ల పరిధిలో 2,91,066 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి సమయంలో, ప్రస్తుతం వర్షాల దెబ్బకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ అవసరమా అని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.