ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం: జానీ

పాలకొండ నియోజకవర్గం: ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని పాలకొండ జనసేన నాయకులు జానీ(ఆర్కే) పేర్కొన్నారు. ఆయన్ మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రం, బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి తరుపున, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయుకులు, వీరమహిళలు, జనసైనికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల, తరుపున నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అలాగే అందులో మరణించిన ప్రతి ఒక్కరు కుటుంబాలుకు ఒడిశా రాష్ట్ర గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ తరుపున ఆదుకోవాలని, వారి కుటుంబాలుకి ఆర్ధిక సహాయంతో పాటుగా, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ మరియు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అందులో ఈ ప్రమాదంలో ఎవ్వరికైనా తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏమైనా జరిగి ఉంటే వారికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రతా చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలని పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ(ఆర్కే) అన్నారు.