రైతు దినోత్సవం సందర్భంగా.. రైతులను సన్మానించిన జనసేన

  • భారతదేశ ఐదవ ప్రధాని చరణ్ సింగ్ పుట్టినరోజు డిసెంబర్ 23వ తెదీని భారత ప్రభుత్వం జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించిన సందర్బంగా జనసేన అదినెత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పొలం బాట పట్టిన జనసైనికులకు రైతుల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటుంటే అంతులేని నిజాలు..

పామర్రు: జనసేన పార్టీ నిర్వహిస్తున్న జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పేరుందిన కృష్ణా డెల్టా నేడు అకాల వర్షాలు, వరదలతో ఒకవైపు నష్టపోతుంటే ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, దళారీ వ్యవస్థతో మరింత కుంటుపడుతున్న వ్యవసాయం సాయం సాయం అందక కౌలుదారుల ఆత్మహత్యలు, కౌలుదారుల గుర్తింపు కార్డులు పొందుటకు అనేక అడ్డంకులతో ఉన్న ఈ పరిస్థితులలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలుదారుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 30 కోట్లు ఆర్థిక సహాయం చెయ్యడం ఈ దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. రైతులకు తను సంపాదించిన డబ్బుని ఇచ్చి వారికి భరోసా కల్పించడం స్ఫుర్తిదాయకమని, జనసేన పార్టీ రైతులను ఆదుకోవటమే కాకుండా జనసేన ప్రభుత్వం ఏర్పాటుతో వివిధ రకాలైన ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను సిద్ధం చేయడం జనసేనతోనే సాధ్యం అని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే వ్యవసాయం పండుగ కాబోతుందని తెలియజేస్తూ.. పామర్రు నియోజకవర్గంలో తోట్లవల్లూరు మండలంలో పర్యటించి రైతులను, రైతు కూలీలను కలిసి వారి సమస్యలను మరియు పరిష్కార మార్గాలను వారి దగ్గర నుండి తెలుసుకుని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి వారిని పచ్చ కండవాలతో సత్కరించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట్ల వల్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు శనివారపు కృష్ణ సుమన్ (కిట్టు) ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు నెరుసు కృష్ణాంజనేయులు పాల్గొని ప్రసంగించినారు. ఈ కార్యక్రమంలో యాకమూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు సనక నవీన్ కుమార్, కార్యదర్శి కడప దుర్గారావు, జన సైనికులు చొప్పరపు నాగేశ్వరరావు, తోట్లవల్లూరు గ్రామ జనసైనికులు నాగ రాజేష్, జనసైనికులు పాల్గొన్నారు.